ఏపీలో కల్తీ సారా రాజ్యమేలుతోంది
BY Telugu Gateway31 July 2020 1:56 PM IST

X
Telugu Gateway31 July 2020 1:56 PM IST
రాష్ట్రంలో మద్యం ధరలను అడ్డగోలుగా పెంచటం వల్ల కల్తీ సారా ఏరులై పారుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. కురిచేడు ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని పేర్కొన్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం వస్తోందని..జిల్లాల్లో వైసీపీ మద్యం మాఫియా ఆగడాలు పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కురిచేడులో శానిటైజర్ తాగి ఏకంగా పది మంది మరణించిన ఘటనపై చంద్రబాబు ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు.
Next Story