Telugu Gateway
Politics

వేలానికి భారత రైల్వే స్టేషన్లు

వేలానికి భారత  రైల్వే స్టేషన్లు
X

భారత్ లో రైల్వే రూపురేఖలు మారిపోబోతున్నాయి. ప్రస్తుతం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అతి పెద్ద నెట్ వర్క్ క్రమక్రమంగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళనుంది. ప్రైవేట్ రైళ్ళతోపాటు ప్రైవేట్ రైల్వే స్టేషన్లు కూడా రాబోతున్నాయి. ఈ పరిణామాలు అన్నింటిని పరిశీలిస్తే రాబోయే రోజుల్లో రైల్వే పూర్తిగా ప్రైవేట్ పరం అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఆలోచన ఉన్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. వేలం ద్వారా ఈ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. మర్చంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన వెబ్ నార్ లో మాట్లాడుతూ ఆయన రైల్వే స్టేషన్ల విక్రయానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇఫ్పటికే 151 ప్యాసింజర్ రైళ్ళను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రైళ్ళ ప్రైవేటీకరణకు సంబంధించిన బిడ్స్ కు మంచి స్పందన వచ్చిందని మంత్రి వెల్లడించారు.

రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు, సిబ్బందికి అన్ని రకాల సదుపాయాలు కల్పించనున్నట్లు పీయూష్ గోయల్ తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధిలో రైల్వేల పాత్ర అనే అంశంపై ఈ వెబ్ నార్ జరిగింది. కోవిడ్ సమయంలో కూడా దేశంలో సరుకు రవాణా వ్యవస్థ కూడా ఎక్కడా ఆగకుండా ముందుకు సాగిందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో విమానాశ్రయాలను ఉపయోగించుకునేందుకు ప్రయాణికులు యూజర్ డెవలప్ మెంట్ ఛార్జీ (యూడీఎఫ్) చెల్లించినట్లు రాబోయే రోజుల్లో ప్రయాణికులు రైల్వే స్టేషన్లను ఉపయోగించుకున్నందుకు యూడీఎఫ్ ఛార్జీలు చెల్లించే పరిస్థితి రాబోతుంది.

Next Story
Share it