పవర్ స్టార్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
‘గడ్డి తింటావా..తవుడు తింటావా. నా బుజ్జి గేదెమ్మ నువ్వు కుడితి తాగుతావా. ఎన్నికల్లో గెలిచి ఎప్పుడు చల్లగా పాలిస్తానో. నువ్వు మాత్రం ఎప్పుడూ తెల్లని పాలిస్తున్నావు. మనుషులనే నమ్మి మోసపోయాను. ఓటేస్తారనుకుంటే వెన్నుపోటేశారు. నన్ను దేవుడన్నాడు ఒకడు. నాకు డైలాగ్ ఇచ్చాడు ఒకడు. నెత్తికెక్కించుకున్నాడు ఒకడు. అందరూ కలసి ముంచేశారు.’ అంటూ సాగింది రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘పవర్ స్టార్’ సినిమాలోని తొలిపాట. రామ్ గోపాల్ వర్మ ముందు చెప్పినట్లుగానే ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఈ పాటను యూట్యూబ్ లో విడుదల చేశాడు.
ఇందులో పవన్ కళ్యాణ్ తో సంబంధం ఉన్న పలు కీలక వ్యక్తుల పాత్రలను కూడా పెట్టాడు వర్మ. అటు రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులతోపాటు సినిమా రంగానికి చెందిన వారు కూడా ఉన్నారు ఇందులో. ఈ సినిమా ట్రైలర్ ను జులై22 న విడుదల చేయనున్నట్లు వర్మ ప్రకటించారు. అది కూడా ట్రైలర్ కు 25 రూపాయల ఛార్జీ వసూలు చేస్తున్నట్లు ప్రకటించి నంచలనం రేపారు.
https://www.youtube.com/watch?v=JA6MkoQGcxU