Top
Telugu Gateway

ఆక్సిజన్ అందక నలుగురు కరోనా పేషంట్లు మృతి

ఆక్సిజన్ అందక నలుగురు కరోనా పేషంట్లు మృతి
X

తెలంగాణలోని నిజామాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఆక్సిజన్ అందక మొత్తం నలుగురు కరోనా పేషంట్లు మరణించారు. గురువారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకోవటంతో అక్కడ శుక్రవారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చనిపోయిన వారిలోముగ్గురు కరోనా ఐసీయూ వార్డులో ఉన్నారు. జనరల్ ఐసీయూలో మరోకరు ఉన్నారు. వీరంతా కూడా నిజామాబాద్ జిల్లా వాసులే. కొంత మంది ఆస్పత్రి ఎదుట ధర్నా చేయటంతో పోలీసులు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story
Share it