మాజీ మంత్రికి కరోనా
BY Telugu Gateway4 July 2020 12:52 PM IST

X
Telugu Gateway4 July 2020 12:52 PM IST
ఏపీకి చెందిన మాజీ మంత్రి, బిజెపి నేత పైడికొండ మాణిక్యాలరావు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు. కరోనా వచ్చిందని భయపడవద్దని.. అది రాకూడని రోగం కాదని.. ప్రమాదకారి కాదన్నారు. సామాజిక దూరం పాటించకుండా ఉంటేనే కరోనా వస్తోందన్నారు. వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. భయపడి టెస్టులు చేయించుకోవడం మానొద్దని పైడికొండల మాణిక్యాలరావు సూచించారు.
Next Story



