చైనాపై కోపం పెరుగుతోంది
BY Telugu Gateway1 July 2020 10:57 AM IST

X
Telugu Gateway1 July 2020 10:57 AM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై మండిపడ్డారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా దారుణంగా విస్తరిస్తోంది. ఇది ఇప్పటికే అమెరికాకు చెప్పలేనంత నష్టం చేసింది. తనకు చైనాపై కోపం రోజురోజుకు పెరుగుతోంది అంటూ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే కరోనా కేసుల విషయంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇఫ్పటికీ అక్కడ వైరస్ నియంత్రణలోకి రాలేదు.
ఇలాగే వ్యవహరిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా విషయంలో ట్రంప్ చైనాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మహమ్మారి గురించి హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్ఓ అలసత్వం ప్రదర్శించిందని.. చైనాను వెనకేసుకొచ్చిందని ఆరోపించారు.
Next Story



