వివాదంలో దానం నాగేందర్

టీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు. బ్యాంకు సిబ్బంది విధులకు ఆటంకం కల్పించి. భూమి .వేలం వేయకుండా అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే నాగేందర్ తోపాటు ఆయన అనుచరులపై బ్యాంకు అధికారులు కేసు పెట్టారు. బ్యాంకు అధికారులను నాగేందర్, ఆయన అనుచరులు అడ్డుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్యాంకు అధికారులను నాగేందర్ అనుచరులు దుర్భాషలాడుతున్న వ్యవహారం కూడా ఇందులో రికార్డు అయింది. కొన్ని సంవత్సరాల క్రితమే ఖైరతాబాద్ లోని స్థలంపై ఓ వ్యక్తి లోన్ తీసుకున్నాడు. డబ్బులు తిరిగి కట్టకపోవడంతో ఆ స్థలాన్ని బ్యాంక్ బహిరంగ వేలానికి పెట్టారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న దానం నాగేందర్ బ్యాంక్ అధికారుల విధులకు అడ్డుతగిలారు.
ఎమ్మెల్యే తన అనరుచరులతో కలిసి వేలాన్ని అడ్డుకున్నారని బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తమపై దౌర్జన్యం చేశారని, బెదిరింపులకు దిగారని తెలిపారు. ఆయన అనుచరులు దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. తక్షణమే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోండి. లేదంటే పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. కమిషనర్ కు ఫిర్యాదు చేస్తా. మీ అందరినీ ఇందులో లాగుతా. దొంగతనం చేశారు. వీళ్లందరినీ లాగుదాం. అర్ధం కావటం లేదా చెబుతుంటే అని దానం నాగేందర్’ వ్యాఖ్యానించారు. దానం వ్యాఖ్యలతో బ్యాంకు ఉద్యోగిని ఎవరో తోయటంతో ఆయన ముందు కదిలారు.