Telugu Gateway
Politics

పీఎం కేర్స్...పీఏసీ సమీక్షకు బిజెపి నో

పీఎం కేర్స్...పీఏసీ సమీక్షకు బిజెపి నో
X

దేశంలో కరోనా కట్టడికి ఏర్పాటు చేసిన నిధి పీఎం కేర్స్. ఈ నిధికి ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాలు సేకరించారు. ఈ నిధులను ప్రభుత్వ ఆడిటర్, లేదా ఇండిపెండెంట్ ఆడిటర్స్ కూడా సమీక్షించటానికి వీల్లేదని నిబంధన పెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు విన్పించాయి. తాజాగా పీఎం కేర్స్, దేశంలో కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు పార్లమెంట్ లోనే అత్యంత శక్తివంతమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) కమిటీ ఓ ప్రతిపాదన పెట్టింది. ఈ కమిటీకి లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఛైర్మన్ గా ఉన్నారు. అత్యంత కీలకమైన ఈ సబ్జెక్ట్ విషయంలో ఏకాభిప్రాయంతో ముందుకెళదామని..సభ్యులందరూ ఈ అంశాన్ని ఆలోచించాలని అధిర్ రంజన్ చౌదరి కోరారు.

అయితే పీఏసీలో అధికార బిజెపికి పూర్తి మెజారిటీ ఉండటంతో భారత్ లో కరోనా వైరస్ ను ఎదుర్కొనే అంశంతోపాటు ఇతర అంశాలు ఏమీ చర్చకు రాకుండా అడ్డుకున్నట్లు సమాచారం. అధిర్ రంజన్ చౌదరి పెట్టిన ప్రతిపాదనకు అతి తక్కువ పార్టీల నుంచి మాత్రమే స్పందన రావటంతో, బిజెపికి మరికొన్ని పార్టీలు కూడా మద్దతుగా నిలవటంతో ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. పీఎం కేర్స్ కు ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు కాబట్టి కమిటీ దీన్ని సమీక్షించటానికి ఛాన్స్ లేదని వాదించినట్లు సమాచారం. అయితే పీఏసీ మాత్రం లద్దాఖ్ ఘటన నేపథ్యంలో ఎల్ ఏసీ వద్ద రహదారుల నిర్మాణం ఇతర అంశాలపై చర్చకు పీఏసీ అంగీకరించింది.

Next Story
Share it