మోడీ భూమి పూజలో పాల్గొనటం రాజ్యాంగ ఉల్లంఘన
BY Telugu Gateway28 July 2020 2:03 PM IST

X
Telugu Gateway28 July 2020 2:03 PM IST
అయోధ్యలో రామమందిరానికి సంబంధించి భూమి పూజ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. దేశంలో 200 మంది ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఆగస్టు 5న జరిగే భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యఅతిధిగా హాజరవుతున్నారు. ఈ అంశంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసద్దుదీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘అధికారిక హోదాలో ప్రధాని మోడీ భూమి పూజకు హాజరు కావటం రాజ్యాంగానికి అనుగుణంగా చేసిన ప్రమాణానికి ఉల్లంఘన కిందకు వస్తుంది. రాజ్యాంగంలోని మౌలిక సిద్ధాంతమే సెక్యులిరజం అని ట్వీట్ చేశారు. అయోధ్యలో 400 సంవత్సరాల పాటు బాబ్రీ మసీదు ఉన్న విషయాన్ని తాము మర్చిపోమని వ్యాఖ్యానించారు. 1992లో నేరపూరిత మూక పగగొట్టిందని అన్నారు.
Next Story



