Telugu Gateway
Andhra Pradesh

కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు
X

న్యాయస్థానాల నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారా?

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయస్థానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయస్థానాల నుంచే ప్రభుత్వాలను నడిపిస్తారా?. డైరక్టుగా మీరే రూల్ చేస్తారా?. అలాంటప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు? ఎంపీలు ఎందుకు?. శాసనసభకు నాయకులను ఎన్నుకోవటం ఎందుకు?. ముఖ్యమంత్రి ఎందుకు?. స్పీకర్ ఎందుకు?’ అంటూ పలు ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగం మనపై నమ్మకంతో రాశారని, భవిష్యత్ లో ఇలాంటి క్లిష్టపరిస్థితులు బహుశా రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండి ఉంటే దీనికి కూడా ఓ ప్రత్యామ్నాయం ఆలోచించి ఉండేవారన్నారు.

హైకోర్టు తీర్పుల తీరును ఆయన తప్పుపట్టారు. కోర్టుల నుంచే ఆదేశాలు వస్తున్నాయి. ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోవటం తోపాటు అలా వద్దు..ఇలా చేయండి అంటూ చెబుతున్నారు. అలా అయితే ప్రజలు ఎందుకు? ఎన్నికలెందుకు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ద్రవ్య బిల్లును కూడా అడ్డుకుని జీతాలు రాకుండా ఆపిన చరిత్ర గతంలో ఎన్నడూలేదన్నారు. తమ్మినేని గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story
Share it