Telugu Gateway
Andhra Pradesh

ధర్మానకు రెవెన్యూ, శంకరనారాయణకు ఆర్అండ్ బి

ధర్మానకు  రెవెన్యూ, శంకరనారాయణకు ఆర్అండ్ బి
X

ఏపీ సర్కారు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించింది. అదే సమయంలో మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించి అత్యంత కీలకమైన రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు అండ్ స్టాంప్స్ శాఖను కేటాయించారు. మంత్రివర్గ విస్తరణ తరువాత ఈ మార్పులు, చేర్పులు చేశారు. కొత్త మంత్రులు అప్పలరాజు కు పశుసంవర్ధక, డెయిరీ,మత్స్య శాఖను, వేణుగోపాల్ కు బీసీ సంక్షేమ శాఖ కేటాయించారు.

శంకర నారాయణకు రహదారులు,భవనాల శాఖ అప్పగించారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయటం ఇదే మొదటిసారి. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభ సభ్యులుగా వెళ్ళటంతో ఈ మార్పులు చేయాల్సి వచ్చింది.

Next Story
Share it