Telugu Gateway
Andhra Pradesh

ఏపీ ఎంసెట్ వాయిదా.. సెప్టెంబర్ మూడవ వారంలో పరీక్షలు

ఏపీ ఎంసెట్ వాయిదా.. సెప్టెంబర్ మూడవ వారంలో పరీక్షలు
X

ఈ విద్యా సంవత్సరంపై కరోనా దెబ్బ దారుణంగా పడబోతోంది. కరోనా మహమ్మారి ఉధృతి ఏ మాత్రం తగ్గకపోవటంతో ఏపీలో అన్ని రకాల కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్షలను వాయిదా వేశారు. ఎంసెట్ తోపాటు ఐసెట్, ఈసెట్, లాసెట్, ఎడ్ సెట్, పీజీసెట్ మొత్తం ఎనిమిది రకాల సెట్ల పరీక్షలను వాయిదా వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాలను మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకు వివరించారు. సెప్టెంబర్ మూడవ వారంలో ఎంసెట్ తోపాటు మిగిలిన పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. షెడ్యూల్ తర్వాత విడుదల చేస్తామన్నారు.

ఈ విద్యా సంవత్సరంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు తొలిసారి డిగ్రీ చదువుతున్న విద్యార్ధులకు సంబంధించి నైపుణ్యాభివృద్ధి కోర్సులతోపాటు ఉద్యోగావకాశాలు పొందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో కూడా అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసిన విషయాన్ని కూడా గమనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్ధులతోపాటు వారి తల్లిదండ్రులు..భాగస్వాములు అందరికీ ఈ విషయంలో స్పష్టత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఢిగ్రీ విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు.

Next Story
Share it