Telugu Gateway
Politics

సుజనా వ్యాఖ్యలు పార్టీ విధానానికి వ్యతిరేకం

సుజనా వ్యాఖ్యలు పార్టీ విధానానికి వ్యతిరేకం
X

ఏపీ బిజెపి కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చారు సీన్ మారింది. గతంలో అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనా చౌదరిల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. సుజనా చౌదరి గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని విషయంలో ఖచ్చితంగా కేంద్రం అవసరమైనప్పుడు జోక్యం చేసుకుంటుందని..కేంద్రానికి ఆ అధికారం ఉంటుందని ప్రకటించారు. మరో వైపు ఢిల్లీలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అప్పుడు చంద్రబాబు సమయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోలేదు...ఇప్పుడు కూడా జోక్యం చేసుకోదు అని ప్రకటించారు.

చంద్రబాబు పిలిస్తే ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేసి వెళ్లారన్నారు. సుజనా వ్యాఖ్యలపై బిజెపి ఆంధ్రప్రదేశ్ శాఖ ఓ ట్వీట్ చేసింది. రాజధాని విషయం కేంద్రం పరిధిలోనే ఉంది అన్న బిజెపి ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యలు పార్టీ విధానానికి విరుద్ధం అని అందులో పేర్కొన్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బిజెపి విధానం అని అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారని తెలిపారు.

Next Story
Share it