అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు
BY Telugu Gateway3 July 2020 7:27 PM IST

X
Telugu Gateway3 July 2020 7:27 PM IST
ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు అయింది. ఆయన బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐలో జరిగిన రూ.150 కోట్లకు పైగా స్కామ్‌తో ప్రమేయం ఉందనే కారణంతో అచ్చెన్నాయుడితోపాటు మరికొంత మంది అధికారులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అచ్చెన్నాయుడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన హైకోర్టులో దాఖలు చేసుకున్న పిటీషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏసీబీ కోర్టు బెయిల్ తిరస్కరించటంతో అచ్చెన్నాయుడు ఇక బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
Next Story



