Telugu Gateway
Cinema

నితిన్ పెళ్లికి ‘రంగ్ దే’ గిఫ్ట్

నితిన్ పెళ్లికి ‘రంగ్ దే’ గిఫ్ట్
X

కొత్త పెళ్లికొడుకు నితిన్ కు ‘రంగ్ దే’ చిత్ర యూనిట్ ఆదివారం నాడు ఓ ఫన్నీ గిఫ్ట్ ఇచ్చింది. ఈ సినిమాలో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి హీరో నితిన్, షాలినీ ల విహహం జరగనుంది. దీన్ని పురస్కరించకుని రంగ్ దే సినిమాలో ఉన్న పెళ్లికి సంబంధించిన సరదా సన్నివేశాలతో కూడిన టీజర్ ను విడుదల చేశారు.

పెళ్ళి తర్వాత నితిన్ పడే కష్టాలు..అంట్లు తోమటం దగ్గర నుంచి బస్టాండే..బస్టాండే అంటూ సరదాగా సాగే పాటతో కూడిన వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. హీరో నితిన్ కూడా ఈ రోజుకు అదనపు ప్రత్యేకతను తీసుకొచ్చిన రంగ్ దే యూనిట్ కు నా కృతజ్ణతలు అంటూ ట్వీట్ చేశారు. పెళ్ళి కొడుకు ఎక్కడ అంటూ మొదలయ్యే టీజర్ సరదాగా సాగిపోతుంది.

https://www.youtube.com/watch?v=7tl11V4dB-E&feature=emb_logo

Next Story
Share it