Telugu Gateway
Politics

కెటీఆర్ గతంలో చెప్పిన సూక్తులు మర్చిపోయావా?

కెటీఆర్ గతంలో చెప్పిన సూక్తులు మర్చిపోయావా?
X

ఆరోపణలు వస్తే విచారణ ఎదుర్కోవాలి కానీ స్టేలు తెచ్చుకోవటం ఎందుకు అని గతంలో సూక్తులు చెప్పిన మంత్రి కెటీఆర్ ఇప్పుడేమీ చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కెటీఆర్ కు దొరికింది తాత్కాలిక ఉపశమనమే అని వ్యాఖ్యానించారు. తప్పు చేయకపోతే భయం ఎందుకు... విచారణ ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటపడండి అని కూడా నీతులు చెప్పిన కెటీఆర్ ఇప్పుడు సిగ్గులేకుండా ఏ మొహంతో స్టే తెచ్చుకున్నాడని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని మరోసారి డిమాండ్ చేశారు. ‘కెటీఆర్ అక్రమ ఫాంహౌస్ పై కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు. స్టే అన్నది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. నార్సింగ్ పోలీసులు రాజేంద్ర నగర్ కోర్టులో సమర్పించిన మెమోను నిన్న కోర్టుకు సమర్పించి ఉంటే స్టే కూడా వచ్చేది కాదు.

అధికారుల పై కేటీఆర్ ఒత్తిడి ఉంది... అందుకే స్టే వద్దని వాళ్లు కోర్టులో వాదించ లేకపోయారు. కేటీఆర్ మంత్రిగా ఉంటే విచారణ సాగదన్న మా అనుమానం నిన్న కోర్టులో నిజమైంది . ఫాంహౌస్ కట్టి ఐదేళ్లైంది కనుక ఎన్జీటీ పరిధిలోకి రాదన్న కేటీఆర్ వాదన సాంకేతికమైనది మాత్రమే . నేను రాజకీయ ప్రత్యర్థిని అని చెప్పి, ఆ ముసుగులో కేటీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నాడు. కేటీఆర్ కు ఫాంహౌస్ ఉందా లేదా... లీజుకు తీసుకున్నాడా... అది అక్రమ కట్టడం అవునా కాదా? సమాజానికి చెప్పాలి. ఏ న్యాయస్థానం నుంచి కేటీఆర్ స్టే తెచ్చుకున్నాడో అదే న్యాయస్థానం ముందు దోషిగా నిలబెడతాం’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it