Telugu Gateway
Cinema

విజయ్ దేవరకొండ న్యూ లుక్

విజయ్ దేవరకొండ న్యూ లుక్
X

ప్రస్తుతం ‘ఫైటర్’ సినిమా పనిలో ఉన్నాడు విజయ్ దేవరకొండ. కరోనా సంక్షోభం, లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలు అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. తాజాగా హీరో విజయ్ దేవరకొండ కొత్త లుక్ తో అభిమానులకు దర్శనం ఇచ్చాడు. అయితే ఇది సినిమా కోసం సిద్ధం చేసుకున్న నూ లుక్కా..లేక సరదా కోసం చేసిందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఫైటర్ సినిమా తొలి షెడ్యూల్ ముంబయ్ లో పూర్తి చేసుకున్నారు.

తర్వాత షూటింగ్ కు కరోనా బ్రేకులు వేసింది. అయితే ఇప్పటికిప్పుడు ముంబయ్ లో షూటింగ్ చేసే పరిస్థితులు కన్పించటం లేదు. ఫాదర్స్ డే సందర్భంగా విజయ్ తన తండ్రి, స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో విజయ్ లుక్ చూసిన వారు ఆశ్ఛర్యపోవాల్సిందే. పొడవైన జట్టు, ఫ్రెంచ్ గెడ్డంతో విజయ్ డిఫరెంటుగా ఉన్నాడు.

Next Story
Share it