Telugu Gateway
Telangana

కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతాం

కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతాం
X

తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య సిబ్బందిని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. నగరంలోని గాంధీ, నీలోఫర్, పేట్ల బురుజు, సుల్తాన్ పూర్ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ఈటెల శుక్రవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో కరోనా పరీక్షలు అతి తక్కువ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మంత్రి పరీక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో రాష్ట్రం ముందంజలో ఉందని..రాబోయే రోజుల్లో కరోనా పరీక్షల సంఖ్యను మరింత పెంచుతామని వెల్లడించారు. కరోనా బారిన పడ్డ వారిని రక్షించేందుకు ప్రభుత్వం ఎంత వ్యయం చేయటానికి అయినా రెడీగా ఉందని తెలిపారు .రాష్ట్రంలో అవసరమైన పీపీఈ కిట్లు, మాస్క్ లు అవసరమైనన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. నిమ్స్ లో కరోనా సోకిన వైద్యులకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కూడా పరీక్షలు చేస్తున్నామని..అలాంటి వారిలో హై రిస్క్ కాంటాక్టు ఉన్న వారికి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా ఉన్నాయన్న విమర్శలపై స్పందిస్తూ ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే ముందుకు వెళుతున్నామని, లాక్ డౌన్ విషయంలో కూడా కేంద్రం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలకు ధైర్యం కల్పించాలి కానీ..అవాస్తవాలు ప్రచారం చేయటం సరికాదని ఈటెల వ్యాఖ్యానించారు.

Next Story
Share it