Telugu Gateway
Telangana

తెలంగాణ సచివాలయంలో మరో కరోనా కేసు

తెలంగాణ సచివాలయంలో మరో  కరోనా కేసు
X

హైదరాబాద్ లోని బీఆర్ కె భవన్ లోని రెండవ అంతస్థులో ఉన్న ఐటి శాఖ లోని మహిళా ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం తెలంగాణ సచివాలయం అంతా అక్కడ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా బాధిత మహిళా ఆఫీసుకు రావటంలేదు. ప్రస్తుతం ఆమె నేచుర్ క్యూర్ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు.

ఐటి శాఖలో కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూడటంతో అధికారులు రెండవ అంతస్థు మొత్తాన్ని శానిటైజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఇప్పటికే ఆర్ధిక శాఖలోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతోంది.

Next Story
Share it