Telugu Gateway
Telangana

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
X

తెలంగాణ ఇంటర్ ఫలితాలను అన్ని జాగ్రత్తలు తీసుకుని విడుదల చేశామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంత్రి గురువారం నాడు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నాం మూడు గంటలకు విడుదల చేశారు. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9,65,839 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో ఫస్టియర్‌ విద్యార్థులు 4,80,516 మంది ఉండగా, సెకండియర్‌ చెందిన విద్యార్థులు 4,85,323 మంది ఉన్నారు. ఫస్టియర్‌లో 60.4 శాతం, సెకండియర్‌లో 68.86 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగానే ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు.

ఫస్టియర్‌లో బాలికలు 67 శాతం, బాలురు 52.30 శాతం ఉత్తీర్ణత సాధించారు.సెకండియర్‌లో బాలికలు 75.15, బాలురు 62.10 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాల్యుయేషన్‌కు సహకరించిన లెక్చరర్లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఐసిఆర్, ఓఎంఆర్ సాంకేతికతను ఉపయోగించుకుని ఫలితాలు నిర్ణయించినట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, రెండవ సంవత్సరం ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీమ్ జిల్లా తొలి స్థానంలో ఉంది.

Next Story
Share it