తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు
BY Telugu Gateway17 Jun 2020 12:12 PM IST

X
Telugu Gateway17 Jun 2020 12:12 PM IST
ఇంటర్ విద్యార్ధుల ఉత్కంఠకు గురువారం నాడు తెరపడనుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఫలితాలకు సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం ఇంటర్ పలితాల వెల్లడిలో పెద్ద ఎత్తున లోటుపాట్లు చోటుచేసుకుని..తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సారి సర్కారు పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇంటర్ రెండవ సంవత్సరం, మొదటి సంవత్సరం ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి..
Next Story



