జీహెచ్ఎంసీ మినహా పదవ తరగతి పరీక్షలకు ఓకే

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలకు సంబంధించి హైకోర్టు శనివారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల వ్యాప్తి విస్తృతంగా ఉన్నందున ఇక్కడ తప్ప రాష్ట్రమంతటా పరీక్షలకు ఓకే చెప్పేసింది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని 'పది' పరీక్షలు వాయిదా వేసి, సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను అనుమతులు ఇచ్చి వారందరినీ రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
సర్కారు మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుని జీహెచ్ఎంసీ పరిధిలో కూడా పరీక్షలు నిర్వహిస్తామని...అందుకు అనుమతించాలన కోరగా న్యాయస్థానం మాత్రం నో చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా విద్యార్ధి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షల కన్నా విద్యార్ధుల ప్రాణాలే ముఖ్యం అని..పరీక్షల కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టలేమని వ్యాఖ్యానించింది. ఒక్కోసారి ఒక్కొక్కరికి పరీక్షలు నిర్వహించటం కష్టం అని ప్రభుత్వం తరపున వాదనలు విన్పించగా..హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్ధుల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యంకాదని స్పష్టం చేసింది.



