తెలంగాణ ఎంసెట్ వాయిదా
BY Telugu Gateway30 Jun 2020 5:09 PM IST

X
Telugu Gateway30 Jun 2020 5:09 PM IST
తెలంగాణ సర్కారు రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లను సర్కారు వాయిదా వేసింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై హైకోర్టులో కూడా కేసు దాఖలు కావటం, రాబోయే రోజుల్లో మళ్ళీ లాక్ డౌన్ విధించే అవకాశం ఉండటంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి ఎంసెట్ పరీక్ష జులై 6 నుంచి 9 మధ్య జరగాల్సి ఉంది.
పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ పరీక్ష జులై 1 నుంచి 3, ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ జులై4న, లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, పీజీ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ జులై 10న జరగాల్సి ఉంది. దీంతోపాటు జులై 13,15 తేదీల్లో కూడా మరికొన్ని పరీక్షలు జరగాల్సి ఉంది. ఇప్పుడు అన్ని పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Next Story