అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్
BY Telugu Gateway16 Jun 2020 11:13 AM IST

X
Telugu Gateway16 Jun 2020 11:13 AM IST
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం అయిన తొలి రోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఉభయ సభలనుద్దేశించి ఆన్ లైన్ ద్వారా ప్రసంగిస్తున్న సమయంలోనే వారు సభ నుంచి వాకౌట్ చేశారు. సభలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అందుకే వాకౌట్ చేశామని టీడీపీ సభ్యులు తెలిపారు.
కక్ష సాధింపులు, వేధింపులు ఆపాలంటూ టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు. సభ నుంచి బయటకు వచ్చే సమయంలో ‘ఇందుకేనా ఒక్క ఛాన్స్’ అడిగింది అంటూ పలు అంశాలతో కూడిన ప్లకార్డులను టీడీపీ ఎమ్మెల్యేలు ప్రదర్శించారు. మంగళవారం నాడు ప్రారంభం అయిన బడ్జెట్ సమావేశాలకు టీడీపీ సభ్యులు నల్లచొక్కాలు ధరించి హాజరయ్యారు.
Next Story



