Telugu Gateway
Politics

అచ్చెన్నాయుడిని ఏమి చేద్దామనుకుంటున్నారు?

అచ్చెన్నాయుడిని ఏమి చేద్దామనుకుంటున్నారు?
X

తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి వ్యవహారంలో ఏపీ సర్కారు తీరును తెలుగుదేశం నేతలు తప్పుపట్టారు. అసలు అచ్చెన్నాయుడిని ఏమి చేద్దామని అనుకుంటున్నారని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. ఏసీబీ కోర్టు మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఆస్పత్రిలోనే విచారించాలని స్పష్టంగా చెప్పినా కూడా డాక్టర్లను బెదిరించి తప్పుడు నివేదికలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

అచ్చెన్నాయుడిని అర్ధరాత్రి ఆస్పత్రి నించి డిశ్చార్జ్ చేసే ప్రయత్నాలపై సీనియర్ నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబులు తప్పుపట్టారు. కోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన అన్నారు. అచ్చెన్నాయుడు పట్ల మొదటి నుంచి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎసిబి జాయింట్ డైరెక్టర్ రవికుమార్ ఆద్వర్యంలో అచ్చెన్నాయుడు, మరో నలుగురు నిందితులను మూడు రోజులపాటు విచారించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.

Next Story
Share it