Telugu Gateway
Telangana

షేక్‌పేట తహశీల్దార్‌ సుజాత అరెస్ట్‌

షేక్‌పేట తహశీల్దార్‌ సుజాత అరెస్ట్‌
X

బంజారాహిల్స్‌ భూ వివాదం కేసులో షేక్ పేట తహశీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో సుజాత పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సుజాత ఇంట్లో దొరికిన 30 లక్షల రూపాయలకు సంబంధించి సరైన ఆధారాలు చూపించలేకపోయారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో సుజాతను మూడు రోజులుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించారు.

ఈ కేసులో రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్‌ సెక్టార్‌ ఎస్సై రవీంద్ర నాయక్‌ను ఇప్పటికే అధికారులు రిమాండ్‌కు తరలించారు. తాజా అరెస్ట్‌ తో ఆ సంఖ్య మూడుకు చేరింది. సుమారు 50 కోట్ల రూపాయల విలువ చేసే బంజారాహిల్స్ భూ వివాదం పరిష్కరిస్తామంటూ ఖాలీద్ అనే వ్యక్తి నుంచి రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నాగార్జునరెడ్డి 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Next Story
Share it