Telugu Gateway
Telangana

తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్ లు

తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్ లు
X

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు అందరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం నాడు వీరు పలు నిరసన కార్యక్రమాలు ప్లాన్ చేశారు. వీటిని అడ్డుకునేందుకే పోలీసులు ఆయా జిల్లాల్లో నేతలను ఎక్కడికి అక్కడ గృహ నిర్భందం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి, మరో ఎంపీ కోమటిరెడ్డితోపాటు నేతలు అందరినీ అరెస్ట్ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా పోలీసులను పెట్టి అరెస్ట్ లు చేయించటం నియంత పాలనకు నిదర్శనం అని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

తమ పార్టీ నాయకుల ఇళ్ల ముందు నుంచి పోలీసులు వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా తాము చేసుకునే కార్యక్రమాలను అడ్డుకోకూడదని ఉత్తమ్‌ అన్నారు. మాట్లాడితే అరెస్టులు చేయడం పాశవిక పాలనకు పరాకాష్ట అని, ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుంది అని ప్రశ్నించారు. ఆవిర్భావ దినోత్సవం రోజు హక్కులు కాలరాస్తే ఎలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ఒక నియంత, అసమర్థత పాలన సాగుతోందని విమర్శించారు.

Next Story
Share it