Telugu Gateway
Telangana

రెండు లక్షల మొక్కలు నాటిన రామ్ కీ ఎన్విరో టీమ్

రెండు లక్షల మొక్కలు నాటిన రామ్  కీ ఎన్విరో టీమ్
X

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రామ్ కో ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. కంపెనీ ఉద్యోగులు భారతదేశంలోని 25 కు పైగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రెండు లక్షలకు పైగా మొక్కలను పలు ప్రాంతాల్లో నాటడం ద్వారా పర్యావరణ పునరుద్ధరణకు తమ వంతు తోడ్పాటునందించారు. దీంతోపాటు వంద బృందాలు పలు గ్రామాల్లో పరిశుభ్రత, స్వచ్చత కార్యక్రమాలను నిర్వహించి వ్యర్ధాలను దూరం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 15వేల మంది ఉద్యోగులు రీల్ స్పాన్సర్ చేసిన వెబినార్లో పాల్గొని వ్యక్తిగత శుభ్రత, స్వచ్ఛత, భౌతిక దూరం ఆవశ్యకత పట్ల అవగాహన పొందారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. సంస్థ ఎండీ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ "పర్యావరణ క్షీణత అనేది ఇప్పుడు అతి పెద్ద ఆందోళనగా నిలుస్తోంది.

పర్యావరణ పరిరక్షణ అనేది మానవులుగా మనందరి బాధ్యత. పర్యావరణ సమస్యకు ఎన్నో కారణాలున్నాయి. అందులో వ్యర్ధాలను సరిగా నిర్వహించకపోవడం కూడా ఒకటి. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు పెరుగుతుండటం వంటివి ఇతర కారణాలు. పర్యావరణాన్ని నిర్వహించడంతో పాటుగా అందుబాటులోని అత్యుత్తమ పర్యావరణ సాంకేతికతలను స్వీకరించడం ద్వారా పర్యావరణాన్ని నిర్వహించడంతో పాటుగా పర్యావరణ వాదాన్ని ప్రోత్సహించడంతో పాటుగా దాని పట్ల అవగాహన మెరుగుపరచడం ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. ఈ లక్ష్యంతోనే, రీల్ బృందం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిటీలకు మద్దతునందిస్తుంది మరియు సస్టెయినబిలిటీ కార్యక్రమాల ద్వారా స్వచ్ఛమైన, సురక్షితమైన వాతావరణానికి మద్దతునందిస్తుంది'' అని తెలిపారు.

Next Story
Share it