Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ ఏడాది పాలనపై రామ్ మాధవ్ ఘాటు వ్యాఖ్యలు

వైసీపీ ఏడాది పాలనపై రామ్ మాధవ్ ఘాటు వ్యాఖ్యలు
X

జగన్ ఏడాది పాలన పాపాలు మర్చిపోలేదు

ఏపీలో ఒకరు బెయిల్ పై...మరొకరు బెయిల్ కోసం

ఏపీలో జగన్ పాలనపై ఇప్పటివరకూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరే ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో బిజెపి జాతీయ నేత రామ్ మాధవ్ వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో పాలన అంతా రివర్స్ లో సాగుతోందని ధ్వజమెత్తారు. జగన్ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు చెపితే ఏడాదిలో ఆయన చేసిన పాపాలు మర్చిపోయినట్లు కాదని వ్యాఖ్యానించారు. ‘వారానికి ఒక సారి కోర్టులతో మొట్టికాయలు తిన్న రాష్ట్ర ప్రభుత్వం బహుశా దేశంలో ఏదీ ఉండకపోవచ్చు. రాజధానిలో అమరావతి విషయంలో రివర్స్..పోలవరం ప్రాజెక్టులో రివర్స్. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామన్నారు. కానీ ఏపీలో కొత్త కొత్త బ్రాండ్లు ప్రవహిస్తున్నాయి. తిరుమలేశుని భూముల్లో రివర్స్. ఎలక్షన్ కమిషన్ వ్యవహారాల్లో రివర్స్. తిరుమల భూముల విక్రయాల విషయంలో ప్రజలు రివర్స్ అయ్యారు. చివరకు వాళ్ళు కూడా రివర్స్ అయ్యారు. ’ అంటూ విమర్శలు చేశారు.

దేశమంతా మోడీ నేతృత్వంలో అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. దేశమంతా అంటే ఏపీ కూడా అందులో భాగమే. వైసీపీ పుణ్యమా అని రాష్ట్రంలో ట్యాక్స్ రెవెన్యూ పెరగలేదు కానీ...తగ్గిపోయింది. ఇది ఒకెత్తు అయితే కరోనా పుణ్యమా అని అందరి రెవెన్యూ తగ్గగింది. అయినా ఏపీకి 45 వేల కోట్లు కేంద్రం వివిధ పద్దుల కింద చెల్లించింది. ఏపీలో ఒకరు బెయిల్ మీద ఉన్నారు..మరోకరు బెయిల్ కోసం ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ ఏడాది పాలన సందర్భంగా నిర్వహించిన వర్చువల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ మాధవ్ ఏపీకి చెందిన నేతలతో మాట్లాడుతూ జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.

Next Story
Share it