Telugu Gateway
Cinema

అమృత కథతో రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’

అమృత కథతో రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’
X

‘హ్యాపీ ఫాదర్స్ డే’ రోజున ఓ విషాదకర తండ్రి సినిమా. కూతురిని అమితంగా ప్రేమించే తండ్రి కథ ఇది అంటూ రామ్ గోపాల్ వర్మ తెలిపారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన అమృత ప్రేమకథ, మారుతిరావు ఆత్మహత్యలతో కూడిన వాస్తవ కథ ఆధారంగా వర్మ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఫాదర్స్ డే నుంచి విడుదల చేశారు. ఈ సినిమాకు ‘మర్డర్ లవ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించటంలో వర్మకు మంచి పేరుంది. రామ్‌గోపాల్‌ వర్మ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి కరుణ క్రాంతి నిర్మాతలుగా ఉండగా.. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

Next Story
Share it