Telugu Gateway
Politics

రాజ్యసభ ఎన్నికలకు లైన్ క్లియర్

రాజ్యసభ ఎన్నికలకు లైన్ క్లియర్
X

కరోనా కారణంగా వాయిదాపడ్డ రాజ్యసభ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 19న దేశంలో 18 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో నాలుగు సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా...ఐదుగురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఏపీలో వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులుగా మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు బరిలో నిలవగా, పరిమళ్ నత్వానీ, అయోధ్యరామిరెడ్డి లు నామినేషన్లు దాఖలు చేశారు.

టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు. సంఖ్యాపరంగా చూస్తే వైసీపీ నాలుగు సీట్లు గెలుచుకోవటం పక్కా. కేవలం పోటీ కోసమే టీడీపీ బరిలో అభ్యర్ధిని పెట్టింది.ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అదే రోజు కౌంటింగ్ కూడా పూర్తి చేయనున్నారు. ఆయా రాష్ట్రాల సీఈవోలు ఎన్నికల కమిషన్ పర్యవేక్షకులుగా ఉంటారు. తెలంగాణలో ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి రాజ్యసభకు కె ఆర్ సురేష్ రెడ్డి, కే.కేశవరావులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.

Next Story
Share it