Telugu Gateway
Politics

మోడీ చెప్పిందొకటి..శాటిలైట్ చిత్రాలు చెప్పేది మరొకటి

మోడీ చెప్పిందొకటి..శాటిలైట్ చిత్రాలు చెప్పేది మరొకటి
X

భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరస పెట్టి విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాహుల్ విమర్శలు కూడా ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అది ఎంతలా అంటే రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాన కార్యాయలం (పీఎంవో) వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఆదివారం నాడు రాహుల్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు చేశారు. సరెండర్ మోడీ అంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు..తాజాగా శాటిలైట్ చిత్రాల ఆధారంగా సర్కారుపై విమర్శలు చేశారు. తూర్పు లద్దాఖ్‌లో గతవారం భారత్‌, చైనా సేనలు తలపడిన గల్వాన్‌ లోయలో శాటిలైట్‌ ఫోటోలను పరిశీలిస్తే ప్యాంగాంగ్‌ సరస్సు వద్ద భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చూపుతున్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు.

చైనా సేనలు మన భూభాగంలోకి రాలేదని, మన పోస్టులను ఆక్రమించలేదని ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష భేటీలో చెప్పిన దానికి విరుద్ధంగా శాటిలైట్‌ ఇమేజ్‌లు ఉన్నాయని రాహుల్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు. శాటిలైట్‌ చిత్రాల్లో చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణలకు పదిరోజుల ముందే గల్వాన్‌ ప్రాంతానికి 200కి పైగా ట్రక్కులు, బుల్డోజర్లు, ఇతర పరికరాలను తరలించినట్టు వెల్లడైందని చెబుతున్నారు. రాహుల్ ఈ వ్యవహారంలో పదే పదే విమర్శలు చేయటంపై బిజెపి మాత్రం మండిపడుతోంది. ఈ సమయంలో రాజకీయాలు చేస్తారా అంటూ విమర్శలు చేస్తోంది.

Next Story
Share it