Telugu Gateway
Politics

చైనా మూకలను ఎప్పుడు తరిమేస్తారు

చైనా మూకలను ఎప్పుడు తరిమేస్తారు
X

చైనా గురించి మాట్లాడకుండా చనాపై మాట్లాడతారా?. అసదుద్దీన్

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. మంగళవారం నాడు జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని తన ప్రసంగంలో ఎక్కడా సరిహద్దు వివాదం అంశాన్ని మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. కరోనాతోపాటు ఈ అంశాలపై కూడా మోడీ స్పందిస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. లద్దాఖ్ లో చైనా మూకలను ఎప్పుడు తరిమేస్తారో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని దేశం మొత్తానికి తెలుసు. లద్దాఖ్ లో నాలుగు స్థావరాల్లో చైనా ట్రూప్స్‌ ఉన్నాయి. మీరు దేశ ప్రజలకు చెప్పండి ఎప్పుడు, ఎలా చైనా మూకలను తరిమివేస్తారో? అని రాహుల్‌ గాంధీ వీడియో ద్వారా మోదీని ప్రశ్నించారు. గత వారం చైనా చర్యలను బహిరంగంగా ఖండించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.

జూన్‌ 15న లద్దాఖ్ లోని గల్వాన్‌ లోయలో చైనా- భారత్‌ సరిహద్దు వివాదంలో 20 మంది భారత సైనికులు అమరులు కావడంతో దేశమంతట ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. మంగళవారం ఇరు దేశాల సీనియర్‌ మిలటరీ కమాండర్స్‌ మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి చర్చలు జరిగాయి. ఇండియా సార్వభౌమత్వానికి, భద్రతకి, రక్షణకి ప్రమాదకరంగా ఉన్నాయంటూ 59 చైనా యాప్స్ ను సోమవారం కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. మోడీ జాతికి ఇచ్చిన సందేశంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. ఈ ప్రసంగంలో చైనా వివాదం గురించి మాట్లాకపోవటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. చైనాపై మాట్లాడాల్సిన ప్రధాని ఆ ప్రస్తావన లేకుండా చనా (పప్పుధాన్యాలు)పై మాట్లాడుతూ తన ప్రసంగాన్ని ముగించారని ఎద్దేవా చేశారు.

Next Story
Share it