Telugu Gateway
Andhra Pradesh

కెటీఆర్..హరీష్ రావులు నిజాయతీపరులు

కెటీఆర్..హరీష్ రావులు నిజాయతీపరులు
X

కెసీఆర్ చెపితే జగన్ వింటారు..

జగన్ వెన్నుపోటు పొడవడు..పొడిపించుకోడు

తెలంగాణ, ఏపీ రాజకీయాలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. 50 లక్షలతో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డికి మంత్రి కెటీఆర్ ను విమర్శించే అధికారంలేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం మంచోడు అని సర్టిఫికెట్ ఇచ్చారు. పోసాని కృష్ణమురళీ ఆదివారం నాడు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘రెండు మూడు రోజులుగా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి అనేక విమర్శలు చేస్తున్నారు..దర్యాప్తు కు ఆదేశిస్తే...మంత్రి పదవికి రాజీనామా చేయమనడం ఏంటీ..ఇది ఎక్కడి లాజిక్ నాకు అర్థం కావట్లేదు..రేవంత్ రెడ్డి 50లక్షలు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి.. ఈ రోజుల్లో ఇలా దొరికిన వ్యక్తి ఎవరూ లేరు..ఇలాంటి వ్యక్తి.. కేటీఆర్ ను రాజీనామా చేయమనడం ఏంటీ. ఉన్న మంచి రాజకీయ నాయకుని పై బురదజల్లడం సరికాదు. కేటీఆర్ ,హరీష్ రావు హానెస్ట్ పొలిటీషియన్స్. వీళ్ళే భవిష్యత్ తెలంగాణ కు రెండు కళ్ళ లాంటి వారు.

కేసీఆర్ నోట్లోంచి ఊడిపడ్డట్లే కేటీఆర్ ఉంటాడు.ఎక్కడ ఎలా ఉండాలో కేటీఆర్ కు భాగా తెలుసు. కేటీఆర్ అవినీతి ని ప్రతిపక్ష నాయకులు నిరూపిస్తే రేపటి నుంచి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణ మొత్తం తిరుగుతా. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది..ఇంత మంచి ప్రాజెక్ట్ కడితె..కమీషన్ ల కోసం అని ప్రతిపక్షాలు విమర్శించడం ఏంటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ,జానారెడ్డి లాంటి వారు విమర్శించే ముందు ఆలోచించాలి. కాంగ్రెస్ నేతలు అద్దం లో వాల్ల మొఖం వాళ్ళఉ చూసుకొని మాట్లాడాలి .నాగార్జున సాగర్ కాంగ్రెస్ ప్రజలకోసమే కడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ప్రజల కోసమే కట్టారు..ప్రతిపక్ష నాయకులు ప్రజల్లో ఉంటే..ఏం జరుగుతుందో తెలుస్తుంది. జగన్ ను చూస్తే తెలుస్తుంది. టిఆర్ఎస్ ను ఓడించాలని రాజకీయాలు చేస్తే ఎప్పటికి ప్రతి పక్షంలోనే ఉంటారు. కేసీఆర్ ఎక్కడ ఉన్నాడన్నది మనకు అనవసరం. ప్రజలకు సేవ చేస్తున్నాడా లేదా అన్నది ముఖ్యం. మీడియా కు ఒకప్పుడు ప్రజలే ప్రయారిటీ.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలు పరిష్కరించుకుంటుంన్నారు. ఏపీ లో ప్రతిపక్షం అసత్యాలతో రైతు లను గందరగోళానికి గురిచేస్తారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మంచి స్నేహం ఉంది...కేసీఆర్ చెప్తే జగన్ వింటాడు...జగన్ రిక్వెస్ట్ చేస్తే..కేసీఆర్ ఆలోచిస్తాడు. పోతిరెడ్డిపాడు అంశాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు పరిష్కరించుకుంటారు. కేటీఆర్ చాలా మంచివాడు... ప్రతిపక్షాల ఆరోపణలు నమ్మకండి..బాలకృష్ణ కోపంగా మాట్లాడినా..విమర్శించినా.. తిట్టినా..ఒక నిమిషమే బాలకృష్ణ హానెస్ట్ ఫెలో...సంపాదన కోసం రాజకియాల్లోకి రాలేదు.. బాలకృష్ణ కోపం సమాజానికి నష్టమేమి కాదు..ఏపీ సీఎం ఎన్టీఆర్ కాదు పొడిపించుకోవడానికి. జగన్. ఆయన పొడవడు..పొడిపించుకొడు.’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it