Telugu Gateway
Cinema

‘వకీల్ సాబ్’ న్యూలుక్ లీక్

‘వకీల్ సాబ్’ న్యూలుక్ లీక్
X

అంతా సాపీగా ఉంటే ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా దెబ్బ అన్ని సినిమాల్లాగానే వకీల్ సాబ్ పైనే పడింది. ఎప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందో తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ కోర్టులో వాదనలు విన్పిస్తున్న ఫోటో ఒకటి లీక్ అయింది.

ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ కు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కు వేణు శ్రీరామ్ దర్శకుడు. సినిమా స్టార్టింగ్ రోజునే ప‌వ‌న్ క‌ల్యాణ్ లుక్ లీక్ అయిన సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it