విద్య అంతా ఇక ఆన్ లైన్ లోనే

కరోనా ఎప్పుడు దేశాన్నివీడుతుందో ప్రస్తుతానికి ఎవరికీ క్లారిటీ లేదు. దీంతో ఇప్పటికిప్పుడు పాఠశాలలు..కాలేజీలు తెరిచే పరిస్థితి లేదు. అందుకే అందరూ ఆన్ లైన్ బాట పడుతున్నారు. పాఠశాలల దగ్గర నుంచి కాలేజీలు అన్నీ కూడా ఆన్ లైన్ లో తమ విద్యార్ధులకు పాఠ్యాంశాలు బోధించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ మేరకు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్ధులకు ఇప్పటికే సందేశాలు అందుతున్నాయి. అంతే కాదు..లాక్ డౌన్ పీరియడ్ లోనూ పలు విభాగాలకు చెందిన విద్యార్ధులను ఆన్ లైన్ శిక్షణ వైపు మొగ్గుచూపారు. కేంద్రం కూడా ఆన్లైన్ బోధనకు అనుమతినిస్తూ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల కోసం ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేసిన ఆల్టర్నేటివ్ అకడమిక్ క్యాలెండర్ (హయ్యర్ సెకండరీ స్టేజ్)ను విడుదల చేసింది.
ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ సందేశాన్ని విడుదల చేశారు. ఈ- పాఠశాల, ఎన్ఆర్ఓఈఆర్, స్వయం, దీక్షా తదితర ఆన్లైన్ ప్లాట్‌ఫాంలతో క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ- వనరులు, ఈ- పుస్తకాలతో ఆన్లైన్లో విద్యా బోధన జరుగుతోంది. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల సహాయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉంటూనే క్రమపద్ధతి ప్రకారం విద్యా బోధన జరిగేందుకు ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేసిన ఆల్టర్నేటివ్ అకడమిక్ క్యాలెండర్ విడుదల చేశాం. ఫోన్, రేడియో, ఎస్ఎంఎస్, టీవీ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా టీచర్లు విద్యార్థులను గైడ్ చేయవచ్చని తెలిపారు.