Telugu Gateway
Telangana

తెలంగాణలో ‘బెడ్స్’ కు కొదవలేదు

తెలంగాణలో ‘బెడ్స్’ కు కొదవలేదు
X

కరోనా బాధితులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిగా పట్టించుకోవటం లేదనే ప్రచారంలో నిజంలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆయన సోమవారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బెడ్స్ కు కొరతలేదని అన్నారు. సీఎం కెసీఆర్ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నిచలేరని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ లో ప్రస్తుతం 17081 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 3500 కి ఆక్సిజన్ పైప్ లైన్ సిద్ధంగా ఉంది. మరో 6500 బెడ్స్ రెండు రోజుల్లో అందిస్తాం. మొత్తం 10 వేల బెడ్స్ ఆక్సిజన్ తో సిద్దం అవుతున్నాయి. సీఎం కెసీఆర్ హైదరాబాద్ లో లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. కేబినెట్ పెట్టీ నిర్ణయం తీసుకుందామని చెప్పారు. జీహెచ్ఎంసీలో కంటైన్ మెంట్ జోన్ లు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పట్టించుకోవడంలేదని సోషల్ మీడియా లో దుష్పచారం బాధాకరం. చెస్ట్ హాస్పిటల్ లో కి వచ్చిన పేషంట్ అనేక హాస్పిటల్ కి తిరిగిన తరువాత వచ్చారు. మిడ్ నైట్ వచ్చినా కూడా చేర్చుకొని రాత్రి అంతా ఆక్సిజన్ ఇచ్చాము. కానీ ఆయన గుండె జబ్బుతో చనిపోవడం బాధాకరం. ఆక్సిజన్ అందిచలేదు అనడం నిజం కాదు. 258 మందికి హెల్త్ వర్కర్స్ కి పాజిటివ్ వచ్చింది. చెస్ట్ హాస్పిటల్ లో హెడ్ నర్స్ విక్టోరియా చనిపోయింది.

హెల్త్ సెక్రెటరీ ఆఫీస్ లో 11 మందికి కరోనా సోకింది, అందరికీ గాంధీ లో చికిత్స. ఒక్కరు చనిపోతే ప్రభుత్వ ఆసుపత్రి లో పని చేసే సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీయవద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ సరిపడినన్ని ఉన్నాయి. అనవసరం గా ప్రైవేట్ కి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. ప్రైవేట్ లాబ్స్ లో కొన్నింటిలో 70-80 శాతం పాజిటివ్ కేసులు రావడం పై అనుమానాలు ఉన్నాయి. అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఇచ్చాము. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుడూ ఎన్ని పరీక్షలు కావాలంటే అంత మందికి పరీక్షలు చేస్తామన్నారు. దేశంలో డెత్ రేట్ 3% ఉంటే మన దగ్గర 1.7 % శాతం ఉంది. పాజిటివ్ వచ్చిన వారు లక్షణాలు లేకపోతే హోమ్ ఐసోలేషన్ లో ఉండండి. అత్యవసర పరిస్థతి ఉంటే 104 కి ఫోన్ చేయండి మేమే అంబులెన్స్ పంపిస్తాము. కరోనా లక్షణాలు ఉన్నవారు కింగ్ కోటి ఆసుపత్రికి రండి అని సూచించారు.

Next Story
Share it