Telugu Gateway
Andhra Pradesh

అలా అయితే లోకేష్ అరెస్ట్ తప్పదు

అలా అయితే లోకేష్ అరెస్ట్ తప్పదు
X

ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు తరహాలోనే తాను కూడా లేఖలు ఇచ్చానని నారా లోకేష్ చెబుతున్నారు. అలా అయితే తప్పుడు లేఖలు ఇచ్చినందుకు లోకేష్ కూ అరెస్ట్ తప్పదన్నారు. బొత్స మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడును అన్యాయంగా అరెస్ట్ చేశారని అంటున్నారు, కానీ అవినీతి జరగలేదని చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు 50 శాతంకు మించి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిన వ్యక్తి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. బీసీల రిజర్వేషన్లు కు గండి కొట్టింది చంద్రబాబు. బీసీల రిజర్వేషన్లుకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయించింది చంద్రబాబు. సీఎం జగన్ ప్రజలకు మేలు చేస్తుంటే చంద్రబాబుకి కడుపు మండిపోతోందని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. పేదలకు మేలు చేస్తున్న మంచి పనులను అడ్డుకుంటే దేవుడు కూడా క్షమించడని మండిపడ్డారు.

‘అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వసతులతో 108, 104 సర్వీసులను రేపు(బుధవారం) సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ప్రమాదం జరిగితే దివంతగ మహానేత వైఎస్సార్‌ హయాంలో నిమిషాల్లో 108,104 వాహనాలు వచ్చేవి. అయితే చంద్రబాబు హయాంలో ఈ సర్వీసులు మూలనపడ్డాయి. 1088 ఒకేసారి 108,104 వాహనాలను సీఎం ప్రారంభిస్తారు. అధునాతన 108,104 వాహనాల కోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తే రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైన చంద్రబాబు ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేపట్టారా?’ అని ప్రశ్నించారు. కరోనాపై చంద్రబాబు నిజాలు మాట్లాడాలి.

సోమవారం ఒక్కరోజే 30 వేల పరీక్షలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 9 లక్షల కరోనా పరీక్షలు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయనన్ని కరోనా పరీక్షలు రాష్ట్రంలో చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామిక ప్రోత్సాహకాలను చంద్రబాబు ఎగ్గొట్టారు. పారిశ్రామిక రంగానికే కాదు అన్ని రంగాలకు ప్రోత్సాహకాలను ఇవ్వలేదు. రూ. 2.75 లక్షల కోట్ల అప్పుల కుప్పలోకి రాష్ట్రానికి చంద్రబాబు దించారు. వేల కోట్ల రూపాయల బకాయిలు చంద్రబాబు పెట్టారు. భూములు ఇచ్చిన తర్వాత పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే భూములు వెనక్కి తీసుకోకపోతే ఏమి చేస్తారు. కక్ష పూరితంగా అమర్‌రాజా భూములు వెనక్కి తీసుకోలేదు. పరిశ్రమ పెట్టడానికి భూములు ఇస్తారా ఫామ్‌ హౌస్‌ కట్టడానికి భూములు ఇస్తారా?’ అని ఫ్రశ్నించారు.

Next Story
Share it