Telugu Gateway
Cinema

పరిశ్రమపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

పరిశ్రమపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
X

‘మా’కు సొంతంగా భవనం కట్టుకోలేమా?

కరోనాను పక్కన పెట్టి షూటింగ్ లు ఎందుకు ?

నాగబాబు వ్యాఖ్యలపై స్పందించేందుకు నో

సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో పాటు పలు అంశాలపై ఆయన ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇంత మంది ఉన్నారు..మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు సొంత భవనం కట్టలేరా?. చెన్నయ్ లో చూడండి ఎలా చేసుకున్నారో. ప్రభుత్వాన్ని అడిగితే ఓ రెండు, మూడు ఎకరాలు ఫ్రీగా ఇవ్వదా..లేకపోతే సొంతంగా భవనం కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామా? అని ప్రశ్నించారు. కరోనాను పక్కన పెట్టి ఇంత అర్జంట్ గా షూటింగ్ లు మొదలుపెట్టాల్సిన అవసరం ఏముంది?. అత్యధిక మొత్తం పన్ను చెల్లించే పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకటి. మా భవనం కోసం విదేశాల్లో షోలు చేశారు. ఐదు కోట్లు..నాలుగు కోట్లు అన్నారు. ఎందుకు ఇవ్వన్నీ మనం సొంతంగా కట్టుకోలేమా?. మనం ఏమన్నా లెక్కల మాస్టర్లమా అంటూ ప్రశ్నించారు. పరిశ్రమలో హిపోక్రసి, సైకోఫాంటసీలు ఎక్కువ.

మైకులు చూడగానే పిచ్చెక్కుతుంది కొందరికి అంటూ మరోసారి బాలయ్య మరోసారి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు తన మీద కోపం ఉండే ఛాన్సేలేదన్నారు. ఒక వేళ గతంలో ఏమైనా విమర్శలు చేసినా అవి రాజకీయాలు అన్నారు. ఇప్పుడు నామా నాగేశ్వరరావుని పార్టీలో జాయిన్ చేసుకోలా. ఆయన ఎన్ని తిట్లు తిట్టాడో తెలుసుగా. రాజకీయాలు వేరు. అందుకే అనేది హిపోక్రసి, సైకోఫాంటసీ అని. నన్ను వేరేగా చూస్తే మాత్రం నాకు తిక్కరేగుద్ది. కేసీఆర్‌కు అటువంటిది ఏమీ లేదు. రామారావు అభిమాని ఆయన. నేనంటే పుత్రవాత్సల్యం ఉంది ఆయనకి.

కాకపోతే ఆ సమావేశాలకు ఎందుకు పిలవలేదో నాకు తెలియదు అన్నారు. నాగబాబు వ్యాఖ్యలపై యాంకర్ ప్రశ్నకు సమాధానం ఇష్తూ ‘‘నాకు ఎవరితోనూ గొడవ లేదు. అతనే మాట్లాడుతున్నాడు. నేనెందుకు మాట్లాతాను అని ప్రశ్నించారు. నాగబాబు వ్యాఖ్యలపై స్పందించమని కోరగా ఛీ ఛీ నేను మాట్లాడమేంటి? ఇండస్ట్రీ అంతా ఇవాళ.. ఆల్మోస్ట్ మనకు సపోర్టింగ్‌గా వస్తున్నప్పుడు ఇంక నేనేం మాట్లాడాలి అని అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించగా నటుడిగా ఆయన మంచి భవిష్యత్ ఉందన్నారు. అయితే రాజకీయాల్లోకి రావటమనేది అతని ఇష్టమని..వృత్తిని వదులుకుని రమ్మని చెప్పలేం కదా అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది వారి సొంత నిర్ణయమన్నారు. అయితే ఇప్పుడు తాను, ఒకప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ రాజకీయాలు, సినిమాల్లో ఒకసారి పనిచేశామని చెప్పారు.

Next Story
Share it