Telugu Gateway
Cinema

అల్లరి నరేష్ సంచలనం

అల్లరి నరేష్ సంచలనం
X

అవును. తొలిసారి ఆయన ‘నగ్నం’గా కన్పించబోతున్నారు. ‘నాంది’ సినిమాలో ఆయన ఈ సాహసం చేశారు. చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసిన టీజర్ లో ఈ విషయం స్పష్టమైంది. ఓ ఖైదీగా ఉన్న నరేష్ ను జైలు సిబ్బంది చిత్ర హింసలు పెట్టడంతోపాటు అసలు బట్టల్లేకుండా కూర్చోబెడతారు. నరేష్ పుట్టిన రోజు సందర్భంగా నాంది చిత్ర యూనిట్ టీజర్ విడుదల చేసిన ఆయన అభిమానులకు ఈ సర్ ప్రైజ్ ఇచ్చింది.

‘ఒక మనిషి పుట్టడానికి కూడా 9 నెలలే పడుతుంది.. మరి నాకు న్యాయం చెప్పడానికేంటి సర్‌.. ఇన్ని సంవత్సరాలు పడుతుంది’ అంటూ అల్లరి నరేష్ చెప్పే డైలాగ్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ సినిమాతో ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతుండగా, ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, న‌వ‌మి, హ‌రీష్ ఉత్తమన్, ప్రవీణ్ ప్రియ‌ద‌ర్శి, దేవీ ప్రసాద్‌, విన‌య్ వ‌ర్మ‌, సీఎల్‌ న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్ర‌పాణి, రాజ్యల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్రమోదిని తదితరులు ఇతర కీలక పాత్రల్లో కన్పించనున్నారు.

https://www.youtube.com/watch?time_continue=2&v=bG3YgHjvG4U&feature=emb_logo

Next Story
Share it