షేక్ పేట ఎమ్మార్వో భర్త ఆత్మహత్య
BY Telugu Gateway17 Jun 2020 10:44 AM IST

X
Telugu Gateway17 Jun 2020 10:44 AM IST
అవినీతి ఆరోపణలతో ఇటీవలే అరెస్ట్ అయిన షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త బుధవారం నాడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. సుజాత భర్త అజయ్ కుమార్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిక్కడపల్లి లోని తన చెల్లెలు ఇంటికి వెళ్లి ఉదయం ఏడు గంటల సమయంలో ఐదు అంతస్తుల భవనం పైనుంచి దూకకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
మృతదేహాన్ని చిక్కడపల్లి పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే మా అన్న ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే ఓ భూమి వ్యవహారంలో ఎమ్మార్వో భారీ ఎత్తున లంచం తీసుకున్నట్లు గుర్తించారు. ఆమె నివాసంలో పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
Next Story



