Telugu Gateway
Politics

జగన్ కు 4వ ర్యాంక్...కెసీఆర్ కు 16వ ర్యాంక్

జగన్ కు 4వ ర్యాంక్...కెసీఆర్ కు 16వ ర్యాంక్
X

సీ ఓటర్ సర్వే ఫలితాలు

‘సీ ఓటర్’ తాజాగా దేశ వ్యాప్త సర్వే చేపట్టింది. ఈ సర్వేను మే నెలలో పూర్తి చేశారు. ఇందులో ప్రధాని నరేంద్రమోడీ పనితీరుతోపాటు దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు 16వ ర్యాంక్ దక్కగా, ఏపీ సీఎం జగన్ కు 4 వ స్థానం దక్కింది. ఏపీ సీఎం జగన్ పాపులర్ సీఎంల్లో చోటు దక్కించుకుంటే..తెలంగాణ కెసీఆర్ మాత్రం లీస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో ఉండటం విశేషం. సీ ఓటర్ సర్వేలో మోస్ట్ పాపులర్ ముఖ్యమంత్రుల్లో 82.96 శాతం ప్రజల సంతృప్తితో ఒడిశా ముఖ్యమంత్రి మొదటి స్ధానం దక్కించుకోగా, 81.06 శాతంతో చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రెండవ స్థానంలో, 80.20 శాతంతో కేరళ ముఖ్యమంత్రి మూడవస్థానంలో, 78.01 శాతం సంతృప్తితో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 స్థానాన్ని దక్కించుకున్నారు. ఐదవ స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆరవ స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఏడవ స్థానంలో హిమాచల్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ , ఎనిమిదవ స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఉన్నారు.

అదే సమయంలో దేశ ప్రధాని నరేంద్రమోడీ 66.2 శాతం మంది మద్దతుతో టాప్ లో ఉన్నారు. మోడీతో పోలిస్తే రాహుల్ చాలా వెనకబడి ఉన్నట్లు సీ ఓటర్ సర్వే తేల్చింది. ప్రధాని మోడీ పనితీరుపై అత్యంత ఎక్కువ సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ఇక్కడ ప్రధాని పనితీరుపై 95.6 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రాలో మోడీ పనితీరుపై 83.6 శాతం, తెలంగాణలో 71.51 శాతం మోడీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సీ ఓటర్ తీసుకున్న శాంపిల్ మాత్రం ఒక్కో రాష్ట్రం నుంచి మూడు వేలు మాత్రమే. ప్రధాని మోడీకి దేశ వ్యాప్తంగా 66.2 శాతం మద్దతు పలుకుతుంటే, రాహుల్ గాంధీకి లభించిన మద్దతు కేవలం 23.21 శాతం మాత్రమే మద్దతు లభించింది.

Next Story
Share it