Telugu Gateway
Politics

ప్రధాని మోడీకి రాహుల్ కీలక ప్రశ్నలు

ప్రధాని మోడీకి రాహుల్ కీలక ప్రశ్నలు
X

‘భారత్ భూ భాగంలోకి ఎవరూ రాలేదు. సరిహద్దులోని ఏ ఒక్క పోస్టు కూడా కబ్జాలో లేదు’ ఇవీ శుక్రవారం నాడు జరిగిన అఖిలపక్షానికి ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలు. వీటిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం నాడు కీలక ప్రశ్నలు సంధించారు. ఆ భూభాగం చైనా వాళ్ళదే అయితే భారత సైనికులు ఎందుకు చనిపోయారు?. వారంతా ఎక్కడ మృతి చెందారు? అంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. భారత భూ బాగాన్ని ఎవరూ ఆక్రమించలేదన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై రాహుల్ ధ్వజమెత్తారు. భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలపై దేశంలోని రాజకీయ పార్టీలకు స్పష్టత ఇఛ్చేందుకు ప్రధాని నరేంద్రమోడీ అఖిలఫక్షం నిర్వహించిన మరుసటి రోజే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ప్రశ్నలు లేవనెత్తటం విశేషం. అఖిలపక్షంలో కాంగ్రెస్ అధ్యక్షురుల సోనియాగాంధీ కూడా గట్టిగానే మాట్లాడారు.

చైనా బలగాలు ఎప్పుడు చొరబడ్డాయి?. ఆ విషయాన్ని ఎప్పుడు గుర్తించారు?. నిఘా విఫలమైందా అంటూ సోనియా కూడా అఖిలపక్షంలో ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే. చైనా దురాక్రమణకు తలొగ్గిన ప్రధాని భారత భూభాగాన్ని వారికి అప్పగించారని రాహుల్ తాజాగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. లద్దాఖ్ లో వీరజవాన్లు భారత్ వైపు చూసిన వారికి సరైన గుణపాఠం చెప్పారని ప్రధాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలోనే దేశానికి 20 మంది సైనికులు అమరులయ్యారు. చైనా తరపున కూడా మరణాలు ఉన్నా ఆ దేశం దీనిపై పూర్తిగా మౌనం దాలుస్తోంది. తాజాగా రాహుల్ గాందీ లేవనెత్తి ప్రశ్నలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Next Story
Share it