Telugu Gateway
Politics

ఆ ఫాంహౌస్ నాది కాదు..నాపై తప్పుడు ప్రచారం

ఆ ఫాంహౌస్ నాది కాదు..నాపై తప్పుడు ప్రచారం
X

చెన్నయ్ కు చెందిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జీటీ) జారీ చేసిన నోటీసుల అంశంపై తెలంగాణ పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ స్పందించారు. తనపై నమోదు అయిన ఈ కేసు ఓ కాంగ్రెస్ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసిన పనే అన్నారు. తనపై అపవాదులు వేసేందుకే అని ఆయన ట్వీట్ చేశారు. తాను గతంలోనే చెప్పానని..ఆ ప్రాపర్టీ తన సొంతం కాదన్నారు. కొంత మంది తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు మార్గాలనే అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా మంత్రి కెటీఆర్ జీవో 111కు తూట్లు పొడిచి ఫాంహౌస్ పేరుతో విలాసవంతమైన భవనంలో ఉంటున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఆయన ఎన్జీటీకి ఫిర్యాదు చేయగా..ట్రిబ్యునల్ మంత్రితో పాటు తెలంగాణ సర్కారుకు కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్జీటీ ఈ వ్యవహారంపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Next Story
Share it