Telugu Gateway
Politics

దేశాన్ని రక్షించే విషయంలో బెదిరింపులకు లొంగిపోవద్దు

దేశాన్ని రక్షించే విషయంలో బెదిరింపులకు లొంగిపోవద్దు
X

భారత్-చైనా సరిహద్దు విషయంలో తలెల్తిన ఉద్రిక్తతలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. ఆయన ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రక్షించుకునే విషయంలో ఎలాంటి బెదిరింపులకు లొంగిపోవద్దని హితవు పలికారు. తన మాటలతో ప్రధాని ప్రత్యర్ధులకు స్వేచ్చ ఇవ్వకూడదన్నారు. మోడీ తాను చేసే వ్యాఖ్యల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశ భద్రత విషయంలో గతంలో మోడీ చెప్పిన మాటలు గుర్తించుకోవాలన్నారు. సరిహద్దులో అసలు ఏమి జరిగిందో చెప్పాలన్నారు. దాచి ఉంచటం దౌత్యనీతి కాదు అని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇది సమర్ధ నాయకత్వం కూడా అన్పించుకోదని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

కర్నల్ సంతోష్ బాబు సహా అమరులైన జవాన్ల కుటుంబాలకు కేంద్రం, ప్రధాని న్యాయం చేయాలని మన్మోహన్ సింగ్ కోరారు. వారికి ఏమి చేసినా తక్కువేనని వ్యాఖ్యానించారు. సంక్షోభ సమయంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలు భారత్ ను చూసే విధానంపై ప్రభావం చూపుతాయని అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళే బాధ్త్యత ప్రధానిదే అని..ఆయన ఈ బాధ్యతను సరిగా నెరవేర్చాలని అన్నారు. గల్వాన్ లోయతోపాటు పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో భారత భూ భాగాన్ని ఆక్రమించేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని మన్మోహన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా చైనాతో వివాదంపై ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it