Telugu Gateway
Politics

చైనా కంపెనీలకు షాకిచ్చిన మహారాష్ట్ర సర్కారు

చైనా కంపెనీలకు షాకిచ్చిన మహారాష్ట్ర సర్కారు
X

ప్రస్తుతం భారత్ లో చైనా వ్యతిరేకత ఓ రేంజ్ లో ఉంది. చాలా మంది చైనా వస్తువులను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. అంతే కాదు సెలబ్రిటీలను కూడా చైనా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండొద్దనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న వారిని చిక్కుల్లో పడేస్తోంది. ఈ తరుణంలో మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా గతంలో కుదిరిన 5000 కోట్ల రూపాయల ఒప్పందాలను పక్కన పెట్టేసింది. కేంద్రంతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ వెల్లడించారు.

ఈ ఒప్పందాలు అన్నీ కూడా భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రికత్తలు లేని సమయంలో కుదిరినవి. ప్రస్తుతానికి పక్కన పెట్టిన ప్రాజెక్టుల్లో 3770 కోట్ల రూపాయల గ్రేట్ వాల్ మోటార్స్ కార్ల ప్రాజెక్టుతోపాటు వెయ్యి కోట్ల రూపాయల ఫోటాన్ (చైనా) పీఎంఐ ఎలక్ట్రో మోబిలిటి సంస్థల ప్రాజెక్టులు ఉన్నాయి. ఇఫ్పటికే కేంద్రం కూడా ఓ రైల్వే ప్రాజెక్టు విషయంలో చైనా కంపెనీకి ఝలక్ ఇచ్చింది.

Next Story
Share it