Telugu Gateway
Politics

ఫాంహౌస్ వివాదం..హైకోర్టులో కెటీఆర్ కు ఊరట

ఫాంహౌస్ వివాదం..హైకోర్టులో కెటీఆర్ కు ఊరట
X

తెలంగాణ ఐటి, పురపాలక శాఖల మంత్రి కెటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా ఆయన జన్వాడలో ఫాంహౌస్ కు సంబంధించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. 111 జీవోకు వ్యతిరేకంగా నిర్మించిన ఈ ఫాంహౌస్ పై తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జీటీ) విచారణకు ఆదేశించటంతో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం ప్రారంభం అయింది. విచారణ సందర్భంగా మంత్రి కెటీఆర్ తన పదవి నుంచి తప్పుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పదే పదే డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని పోరాటం చేస్తున్నారు.

ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదస్పద ఫాంహౌస్‌ తనది కాదని స్పష్టం చేస్తూ హైకోర్టుకు నివేదిక అందించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రేవంత్‌ పిటిషన్‌పై ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. తమ వాదనలు వినకుండా ఎన్ జీటీ నోటీసులు జారీ చేసిందని అందుకే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

Next Story
Share it