Telugu Gateway
Andhra Pradesh

జగన్ సర్కారుపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్ సర్కారుపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

చంద్రబాబు అవినీతి ప్రభుత్వం...జగన్ ది అహంకార ప్రభుత్వం

ఏపీ సర్కారుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుది అవినీతి ప్రభుత్వం అయితే..జగన్ ది అహంకార ప్రభుత్వం అని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రస్తుతం పోలీసు రాజ్యం నడుస్తున్నట్లు కన్పిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది ఏ మాత్రం మంచిదికాదన్నారు. తనకే ఈ అంశంపై చాలా ఫిర్యాదులు వచ్చాయని..చివరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా అరెస్ట్ లు చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. జగన్ ప్రభుత్వం అసత్యాలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మద్యం, ఇసుక మాఫియాలు పురుడుపోసుకున్నాయని విమర్శించారు.

అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చివరి నయాపైసా వరకూ కేంద్రమే భరిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. బిజెపికి చెందిన రాయలసీమ జోన్ జనసందేశ్ వర్చువల్ ర్యాలీలో పాల్గొని కిషన్ రెడ్డి ప్రసంగించారు. గతంలో అవినీతి దే రాజ్యం... నేడు పోలీసులు రాజ్యం ఏలుతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ మారితే కష్టం....పార్టీ ల ర్యాలీలో పాల్గొంటే కష్టం అన్నట్లు పరిస్థితి ఉందన్నారు. టిడిపిలో హయాంలో కేంద్రీకరణ అవినీతి ఉండేది.....ఇప్పుడు వికేంద్రీ కరణ అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇది మంచి పరిణామం కాదని..ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story
Share it