Telugu Gateway
Andhra Pradesh

కరోనాతో కాణిపాకం ఆలయం బంద్

కరోనాతో కాణిపాకం ఆలయం బంద్
X

దేవాలయాలను కరోనా వైరస్ వదలటం లేదు. జూన్ 8 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలకు అనుమతి ఇఛ్చిన విషయం తెలిసిందే. తాజాగా తిరుమలలోని ఓ ఆలయంలోనూ కరోనా కలకలం రేపింది. తాజాగా కాణిపాకం ఆలయం లో కూడా కరోనా కారణంగా మళ్ళీ భక్తుల ప్రవేశాలను నిషేధించారు. ఆలయ హోం‌గార్డుకు కరోనా వైరస్ సోకటంతో భక్తుల అనుమతిని నిషేధించారు. రెండు రోజుల పాటు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొత్తం 60 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.

Next Story
Share it