Telugu Gateway
Politics

డొనాల్డ్ ట్రంప్ కు అరెస్ట్ వారంట్

డొనాల్డ్ ట్రంప్ కు అరెస్ట్ వారంట్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అరెస్ట్ వారంట్ జారీ. అంత సాహసం ఎవరు చేస్తారు.. అసలు ఈ వార్త నిజమేనా? అన్న అనుమానం వస్తుందా?. సహజమే. కానీ ఇది నిజం. ఈ అరెస్ట్ వారంట్ జారీ చేసింది ఇరాన్. అంతే కాదు ఆయన్ను అదుపులోకి తీసుకోవటానికి సహకరించాలని ఇంటర్ పోల్ సహకారాన్ని కూడా కోరింది. డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ సైనికాధికారిని చంపినందుకు ట్రంప్‌తో పాటు మరికొంత మందిని నిర్బంధంలోకి తీసుకుంటామని ఇరాన్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని ఓ స్ధానిక ప్రాసిక్యూటర్‌ సోమవారం వెల్లడించినట్టు ఓ వార్తాసంస్థ పేర్కొంది

ఇరాన్‌ చర్యతో ట్రంప్‌నకు అరెస్ట్‌ ప్రమాదమేమీ ఉండదు. కానీ ఇది రాబోయే రోజుల్లో ఇరాన్‌, అమెరికాల మధ్య ఈ పరిణామం ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. బాగ్దాద్‌లో ఈ ఏడాది జనవరి 3న వైమానిక దాడిలో జనరల్‌ ఖాసిం సులేమానిని హతమార్చిన ఘటనలో ట్రంప్‌తో పాటు 30 మందికి పైగా ఇతరులపై హత్య, ఉగ్రవాద అభియోగాలున్నాయని ప్రాసిక్యూటర్‌ అలీ అల్ఖాసిమెర్‌ పేర్కొన్నట్టు ఆ వార్తాసంస్థ వెల్లడించింది. ట్రంప్‌ అధ్యక్ష పదవీకాలం ముగిసినా ఆయన ప్రాసిక్యూషన్‌ను ఇరాన్‌ కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

Next Story
Share it